ఈ పుట అచ్చుదిద్దబడ్డది

170

ఆనందమఠము


చెప్పినవిధముగా నాస్వామి చచ్చినను చావనిండు; నేను అభ్యంతరము చేయుదానను గాను, అనెను.

బ్రహ్మచారి—— దీర్ఘ నిశ్వాసము విడిచి, తల్లీ ! ఈఘోర వ్రతంబునకు బలిదానము కలదు. మనమందఱమును బలి కా వలసి యున్నది, నేను చచ్చెదను. జీవానంద భవానందులును చత్తురు. తల్లీ, నీవును చచ్చెద వని తోచుచున్నది. అయినను పని చేసి చావవలయును. పని చేయక చచ్చుట బాగగునా? నేను ఎప్పుడును స్వదేశమును మాత్రము తల్లి యని పిలుతు గాని మఱెవ్వరి నట్లు పిలువను. ఏలన, సుజలమును, సుఫలమును గల భూమియే మనకు తల్లి; ఇపుడు నిన్నుఁ దల్లియని నుడివితిని. నీవు తల్లివై సంతానుల కార్యమును జేయుము. దేనిచే కార్యోధార మగునో దానినిఁ జేయుము. జీవానందుని ప్రాణరక్షణము సేయుము, నీ ప్రాణరక్షణమును జేసికొనుము.

ఇట్లని చెప్పి, సత్యానందుఁడు “హరే మురారే మధుకైటభారే” అని పాడుచు పోయెను.


ముప్పది మూఁడవ ప్రకరణము

సత్యానందుఁడు యుద్ధమునకుఁ బురికొలుపుట

తీర్థయాత్ర చేయుటకై పోయిన సంతానులలో సత్యానందుఁడు మాత్రము మరలి వచ్చె ననియును, సంతానుల కండఱకు 'నేమో చెప్పవలయు నని యున్నాఁ డనియును, సంతానులందఱును రావలసిన దని సెల వైనదనియును ప్రకటింపఁబడెను. గుంపులు గుంపులుగా సంతాను లందఱును అజయనదీతీరమున