ఈ పుట అచ్చుదిద్దబడ్డది

168

ఆనందమఠము


ధూమకేతుమివ కిమపి క రాళమ్
కేశవ ధృత కల్కి శరీర
జయ జగదీశ హరే.

అని.

శాంతి యది యెవరి కంఠధ్వనియో దానిని దెలిసికొని,'నిలుము' అని చెప్పి సారంగ తంత్రులను బిగించి తనకంఠము నెత్తి పాడెను.

వేదా నుద్ధరతే జగంతి వహతే భూగోళ ముద్బిభ్రతే
దైత్యం దారయతే బలిం ఛలయతే క్షత్ర క్షయం కుర్వతే,
పౌలస్యం జయతే హలం కలయతే కారుణ్య మాతన్వతే
మ్లేచ్ఛాన్మూర్చయతే దశాకృతిక్రుతే కృష్ణాయ తుభ్యం నమః,

ఇట్లు పాడుచుఁ బాడుచు, నాదీర్ఘ'తాళమును, ఆయుచ్చ మైనట్టి గగనవిదారక స్వరమును, తగ్గించికొని శాంతి మరలఁ బాడెను:——

దినమణి మణ్ణన భవఖణ్డన మునిజనమానసహంస.

శాంతి భక్తిభావముతో ప్రణతయై సత్యానందుని పాదధూళిని గ్రహించి, “ప్రభూ! నేనేమి పుణ్యము చేసియుంటినో తమ శ్రీ పాదపద్మ దర్శనమయ్యెను. సెల విండు. నాచే నేమి కావలయునో?” అని చెప్పి సారంగమును శ్రుతి గూర్చి మరల పాడెను:——

తవచరణ ప్రణతావయమితి భావయ
కురు కుశలం ప్రణతేషు

అని.

సత్యానంద——తల్లీ! నీకుఁ గుశలమే యగును గాక !

శాంతి——ఎట్లు ప్రభూ! తమ యాజ్ఞ యైయున్నది కదా! నా వైధవ్య మని.

సత్యానంద—— నిన్ను నే నెఱుఁగను, త్రాటిబలమును దెలి