ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పది రెండవ ప్రకరణము

శాంతి దృఢచిత్తమును సత్యానందుఁ డెఱుఁగుట

జీవానందుఁడు కుటీరమును విడిచి బయటికి పోయినపిదప, శాంతి మరల సారంగమును చేతఁబట్టికొని మృదుమధుర ధ్వనితో సంగీతము పాడుచుండెను.

ప్రళయ పయోధిజలే ధృతవానసి వేదమ్
విహిత వహిత్ర చరిత్ర ముఖేదమ్
కేశవ ధృత మీన శరీర
జయ జగదీశ హరే.

అని.

జయ దేవస్వామిచే విరచితమైన యామధురమైన స్తోత్రము శాంతి దేవి కంఠమునుండి వెడలి, యా యపారమగు కాన నముయొక్క నిశ్శబ్దమైన మౌనమును జీల్చికోని పూర్ణ జలోచ్ఛ్వాస సమయంబునందు వసంతకాల మలయానిలముచే తాడిత మైన తరంగభంగమువలె మధురముగా వినఁబడెను. అపు డామె మరలఁ బాడ నారంభించెను,

నిన్దసి యజ్ఞ విధే రహహ శ్రుతిజాతమ్
సదయ హృదయ దర్శిత పశుఘాతమ్
కేశవ ధృత బుద్ధ శరీర
జయ జగదీశ హరే.

అప్పుడు బయటనుండి యెవరో అతిగంభీరమైన ధ్వనిచే మేఘగర్జనముచాడ్పున గానము చేసిరి.

మ్లేచ్ఛ నివహ నిధనే కలయసి కరవాలం