ఈ పుట అచ్చుదిద్దబడ్డది

165

ముప్పదియొకటవ ప్రకరణము


రాత్రి గాఢమైన చీఁకటిగా నుండెను. ఆవిస్తారమైన యరణ్యము జనశూన్యమై యుండెను. అది దుర్భేద్యమై యుండి నందువలన వన్య మృగంబులు సహితము తిరుగుటకు ప్రతిబంధకముగా నుండెను. దూరమునం దప్పుడప్పుడు వ్యాఘ్రహుంకారమును, ఇతరమృగములు క్షుధాభీతిచేఁ గూయునట్టి వికట శబ్దములును వినంబడుచుండెను. ఒక్కొకసారి పెద్ద పెద్ద పక్షుల పక్షకంపమును, ఒక్కొకసారి 'తాడితశబ్దములు, వధ్య, లేక వధకారి మృగములు పరువిడు ధ్వనియును వినఁబడుచుండెను. ఆవిజనస్థలమునం దాయంధ కారమున శిథిలమయిన గృహమున భవానందుఁ డొక్కఁడే కూర్చుండి యుండెను. వాని పాలిటి కాకాలంబున పృథ్వియే లేదు, కేవలము భీతికి ఉపాదానమయి యుండెను. వాఁడు కపోలమునఁ జేయి నిడికొని చింతించు చుండెను. చలనము లేదు. నిశ్వాసము లేదు భయము లేదు. అత్యంతము చింతామగ్నుఁడై, ఏది భవితవ్యమో యది అవశ్యముగా నగును. "నేను భాగీరథీ జలతరంగ సమీపము నందలి గున్న యేనుఁగువలె నింద్రియ స్రోతమున మునిఁగి తేలు చున్నాను; ఇదే నాదుఃఖముగా నున్నది; ఇఁక ఒక ముహూర్త కాలములోపల దేహము ధ్వంస మగును. దేహధ్వంసమే యింద్రియ ధ్వంసము;నే నాయింద్రియములకు వశీ భూతుఁడ నైతిని నాకు మరణమే శ్రేయము, ధర్మ త్యాగీ! ఛీ! చచ్చెదను." అని యాలోచనాస్రోతము ప్రవహింపుచుండఁగా, తలపై నొక పేచకపడక్షి మృదు వగు గంభీరధ్వనిఁ జేసెను. భవానందుఁడు నోరు విడిచి, "అదేమి శబ్దము? ఆ వినఁబడినది చూడఁగా నన్ను యముఁడు పిలుచుచున్న ట్లున్నది; ఏమి శబ్దము చేసెనో; ఎవరు