ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12

ఆనందమఠము


అనేకులు పరదేశములకుఁ బోయిరి. అచ్చోటఁగూడ అన్నము లేనందున అనేకులు చచ్చిరి, కొందఱు తినరాని వస్తువుల నంతయు తిని దానిచేఁ గలిగిన రోగములవలన మహాకష్టమనుభవించి ప్రాణత్యాగము చేసిరి.

రోగాద్యుపద్రవములకు మంచి సమయము దొరకెను. జ్వరము, విషూచి, క్షయము, స్ఫోటకము మొదలగు రోగములు కలిగెను. ఒక్కస్ఫోటక వ్యాధి చేతనే అనేకులు గతించిరి. ఏయింటఁ జూచినను చావే; ఎచ్చోటఁ జూచినను రోదన ధ్వనియే. అట్టి కాలమున నొకరి కొక రెట్లు ఉపచరింతురు? ఊఱడింపఁ జేయుదురు ఒకరినొకరు చూచుటకే సాధ్యము కాకుండెను. చచ్చి వారిని మోయువారే లేకపోయిరి. అతి రమణీయసౌధములయందు రోగము వచ్చినవారు అచ్చటనే పడి పరితపించి ప్రాణము విడిచిపెట్టిరి. స్ఫోటకము కనుపించిన తోడనే వారి నక్కడనే విడిచి పెట్టి తక్కినవారు భయముచే పరుగిడి పోవుచుండిరి.

పదచిహ్న గ్రామమునందు మహేంద్ర సింహుఁడను ధనికుఁడుండెను. ఈ క్షామ కాలమున ధనికుఁడును నిర్ధనికుఁడేకదా. దుఃఖపూర్ణ సమయమునందు వానిస్వజనులును, పరిజనులును వ్యాధిచేఁ పీడింపఁబడిన వారై యందఱును వెడలిపోయిరి. కొందఱు మృతిఁ జెందిరి. ఆగొప్ప మేడయందున్న యనేకజనులలో వాఁడును, వాని భార్యయు, వాని కూఁతురు పసిపిల్లయు, చావునకు తప్పియుండిరి.

మహేంద్ర సింహుని భార్య కల్యాణి, ఆలోచన చేయుటనుమాని, తానే పాలుపిండి కాఁచి పిల్లకుపోయుచు, ఆవులకు