ఈ పుట అచ్చుదిద్దబడ్డది

162

ఆనందమఠము


ధీరానంద——కావచ్చును.

భవానంద——అయినను రమ్ము. ఈ విజనస్థలమున మన మిరువురమును జగడము చేయుదము. నిన్నుఁజంపి నేను నిష్కం టకుఁడ నయ్యెదను, అట్లు గానిచో నన్ను నీవు చంపి నీకోప జ్వాల నంతయు నణఁగించుకొనుము. ఆయుధ మున్నదా ?

ధీరానంద——ఉన్నది. ఉత్త చేతులతో, నామాటలన్నియు నీతోఁ జెప్పుటకు సాధ్య మగునా ? యుద్ధమే నీమత మైయుం డినచో నావశ్యకముగా జేయుదును. సంతానులకు పరస్పరము విరోధము నిషిద్ధము. ఆత్మరక్షణార్థమై యెవరితో విరుద్ధము చేసినను నిషిద్ధము లేదు. అయినను, ఏమాట చెప్పుటకై నిన్ను వెదకుచుంటినో దాని నంతయు నీవు విన్న తర్వాత యుద్ధముచేయుట మంచిదికదా?

భవానంద——చెప్పుము బాధక మేమి ?

భవానందుఁడు కత్తిని యొరనుండి తీసి ధీరానందుని భుజముపై నుంచెను. ధీరానందుఁడు భయపడి పరుగిడ లేదు.

ధీరానంద—— నేనేమి చెప్పుచున్నా ననఁగా, నీవు కల్యాణిని వివాహము——

భవానంద—— కల్యాణి కది తెలియునా ?

ధీరానంద——ఎందులకు చేసికొనదు?

భవానంద——దానికి మగఁడున్నాడు కదా ?

ధీరానంద——వైష్ణవులం దిట్టివివాహము కావచ్చును.

భవానంద——అది వట్టిగొడ్డు సన్న్యాసిరాదు——సంతానులకు వివాహమే లేదు.

థీరానంద——సంతానులధర్మ మపరిహార్యమా! నీప్రా