ఈ పుట అచ్చుదిద్దబడ్డది

160

ఆనందమఠము


భవానంద—— (సాశ్రులోచనుఁడై) పంపెదను. నేను చచ్చిన పిదప నన్ను జ్ఞాపకము చేసికొనియెదవా ?

కల్యాణి——వ్రతచ్యుతుఁ డైన అధర్మి వని జ్ఞాపకము జేసికొందును.

భవానందుఁడు వెడలి పోయెను. కల్యాణి పుస్తకమును జదువుచుఁ గూర్చుండి యుండెను.


ముప్పదియవ ప్రకరణము

భవానంద ధీరానందుల సంవాదము

భవానందుఁ డాలోచనా క్రాంతుఁ డై మఠమునకు వెడలెను. పోవుచుండఁగాఁ బొద్దు క్రుంకెను, అడవియం దొక్కఁడే పోవుచుండెను. అచ్చట నెవఁడో యొకఁడు ముందు పోవు చుండెను. భవానందుఁ 'డెవరది' యని యడిగెను.

అగ్రగామి——అడుగువా రేవరు? తెలిసినచో నుత్తర మిచ్చెదను. నేను నధికుఁడను.

భవానంద—— వందే.

అగ్రగామి——మాతరం.

భవానంద—— నేను భవానంద గోస్వామిని.

అగ్రగామి——నేను ధీరానందుఁడను.

భవానంద——ధీ రానందా ! ఎచటికిఁ బోయి యుంటివి ?