ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువదితోమ్మిదవ ప్రకరణము

159


నునియందు కాలి భస్మమగుఁగాక. ధర్మము పోయెను, ప్రాణము దక్కేను. ఇప్పటికి నాలు గేండ్లుగా ప్రాణము తడబడు చున్నది. పోదు, ఇఁక నిలువదు; దాహము ! కల్యాణి ! దాహము! జ్వాల ! కాల్చి వేయుద మన్నను కట్టెలు లేవు, ప్రాణము పోవుచున్నది, నాలుగేండ్లు సహించితిని, ఇంక సహింపఁజాలను, నీవు నాదాన వయ్యెదవా ?

కల్యాణి——సంతానులధర్మమందు ఇంద్రియము పరవశ మైనచో దానికిఁ బ్రాయశ్చిత్తము మరణ మని నీవు చెప్పి నావే, యది నిజమేనా ?

భవానంద——నిజమే.

కల్యాణి—— ఆటులైనచో నీకుఁ బ్రాయశ్చిత్తము మరణమో?

భవానంద—— నాకుఁ బ్రాయశ్చిత్తము మరణ మొక్కటియే.

కల్యాణి — నేను నీ యిష్టార్థమును నెఱవేర్చినయెడల నీవు చచ్చెదవా?

భవానంద——నిశ్చయముగాఁ జచ్చెదను.

కల్యాణి——నీయిష్టార్థము నెఱవేఱని యెడల?

భవానంద—— అప్పటికిని మరణమే నాకుఁ బ్రాయశ్చిత్తము. ఏ లనఁగా, నాచిత్తము ఇంద్రియవశమై యున్నది.

కల్యాణి——నీ యిష్టార్థమును దీర్పఁజలను ; నీ వెపుడు చచ్చెదవు ?

భవానంద——రాఁగల యుద్ధమునందు.

కల్యాణి——అట్లయినచో పో. నాబిడ్డను పంపెదవా ?