ఈ పుట అచ్చుదిద్దబడ్డది

158

ఆనందమఠము


భజనంద——నీవు పునర్వివాహము చేసికొందువా? నీకు పునర్జన్మ మైనది.

కల్యాణి—— నాబిడ్డను తెచ్చి విడువుము.

భవానంద——తెచ్చి వీడిచెదను, మరల వివాహము చేసి ఆందువా?

కల్యాణీ——నిన్నే నా ?

భవానంద——చేసికొనెదవా!

కల్యాణి—— నిన్నే నా?

భవానంద——అట్లే యనుకొనుము.

కల్యాణి——సంతానధర్మ మెచ్చట నుండును ?

భవానంద——అతలజలమునందు

కల్యాణి——ఈ మహా వ్రతమో ?

భవానంద——అతలజలమునందు.

కల్యాణి——ఎవరికొఱకై దీని నంతయు నతలజలమున ముంచెదవు?

భవానంద——నీకోఱకే. కల్యాణీ ! మనుజుఁడే గాని, ఋషియేగాని, సిద్ధుఁడేగాని, దేవతయేగాని, చిత్తము అవశమైనది. సంతానధర్మము నాప్రాణ మైయున్నది. అయినను, నేఁడు చెప్పెద వినుము. నీవు నాప్రాణాధిక ప్రాణము. నే నెన్నఁడు నీకుఁ బ్రాణదానమును జేసితినో నాఁటనుండి నేను నీపాదమూలమున విక్రీతుఁడనై పడి యున్నాను. ప్రపంచమునందిట్టి రూపరాశి యున్నదని తెలియదు. ఇట్టి రూపరాశిని గన్నులతో నెన్నఁ డైన జూడఁగల నని తెలిసి యుంటి నేని, సంతానధర్మమునే కైకొని యుండను. ఈధర్మము ఈసంతా