ఈ పుట అచ్చుదిద్దబడ్డది

156

ఆనందమఠము


కల్యాణి——ఎచ్చట నున్నారు? పదచిహ్నమునందేనా?

భవానంద——ఔను, అచ్చటనే యున్నాఁడు.

కల్యాణి——ఏమిపని చేయుచున్నారు?

భవానంద——అతఁ డదేపనిని చేయుచున్నాఁడు, కోట నిర్మించుట, అస్త్ర నిర్మాణము అతనిచే నిర్మితములైన ఫిరంగి, గుండు, తుపాకి, మందు మొదలగునవి మనకుఁ గొఱఁత లేకున్నవి. సంతానులందు అతఁడే శ్రేష్టుఁడు. అతఁడు మన కందఱకును మహోపకారము జేసినవాఁడు, అతఁడే మన కుడి భుజము.

కల్యాణి——నేను ప్రాణత్యాగము చేయకున్నచో నివన్నియు నగుచుండెనా? ఎవని ఱోమ్మునకు ఱాయి గుండు మన్ను కుండ కట్టబడి యుండునో, వాఁడు సంసారసాగరము నీఁదఁగలఁడా? కాలికి సంకెళ్లు తగిలించినచో పరుగెత్తగలఁ డా? నీవు సన్న్యాసివై యీపాడుజీవము నేల పెట్టుకొని యున్నావు?

భవానంద——స్త్రీ సహధర్మిణి; ధర్మమునకు సహాయురాలు.

కల్యాణి—— కొద్దికొద్ది ధర్మంబులందు సహాయురాలు: పెద్ద పెద్ద వానియందు కంటకురాలు. ముల్లును ముల్లుతోనే కదా తీయవలయును, కాఁబట్టి నేను విషకంటకము చేత నతని ధర్మకంటకమును బేఱికి వేసితిని——చీ! దురాచారపామర బ్రహ్మ చారీ! ఈప్రాణమును మరల నాకేల యొసంగితివి?

భవానంద— మంచిది; ఎవఁ డొసంగెనో యాప్రాణము వానియది కల్యాణీ! ఏప్రాణము నీకు నే నొసంగితినో, ఆప్రాణమును నీవు నాకొసంగఁజాలవా?