ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువదితోమ్మిదవ ప్రకరణము

155.


కల్యాణీ—— అంతయు ముగిసెను. కేవల స్త్రీత్వము ముగియ లేదు.

భవానంద—— అభిధానమో! (అమరమో).

కల్యాణి——స్వర్గమో వర్గమో తెలియ నేరక పోయితిని. మీరు తెలియునట్లు చెప్పఁగలరా?

భవానంద——నీకుఁ దెలియని దానిని నేనును తెలుపఁగలనా? సాహిత్యము మొదటివలె సాగుచున్నదా?

కల్యాణి——పూర్వాపరము నాకుఁ దెలియదు, కుమార సంభవమును విడిచిపెట్టి హితోపదేశమును జదువుచున్నాను.

భవానంద——ఏల? కల్యాణి!

కల్యాణి——కుమారసంభవమునందు దేవచరిత్రము; హితోపదేశమునందు పశుచరిత్రము.

భవానంద——దేవచరిత్రమును విడిచి పశుచరిత్రమం దనురాగ మేల?

కల్యాణి——నానెత్తి వ్రాత నాస్వామిసమాచార మేమి?

భవానంద——మాటిమాటికి వాని సమాచారము నేల యడిగెదవు? వాఁడేమో నీపాలిటికి జచ్చినట్లే

కల్యాణి——నేనే అతనిపాలికిఁ జచ్చినట్లు; అతఁడు నా పాలిటికిఁ గాదు.

భవానంద——అతఁడు నీపాలిటికిఁ జచ్చె ననికదా నీవు చచ్చినది? మాటిమాటి కామాట యేల కల్యాణీ!

కల్యాణి——చచ్చినను సంబంధము తప్పునా? అతఁ డెట్లున్నాఁడు?

భవానంద——బాగుగా నున్నాఁడు.