ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువది తొమ్మిదవ ప్రకరణము

153


గుచ్ఛము కల్గియుండెను. ప్రశస్తమును పరిపూర్ణమునైన లలాట దేశంబునందు ఆతులమైన తూలికా (బ్రష్షు,లేక పెన్సిల్) లిఖిత భ్రాధనువుండెను. మునుపటివలెనే విస్ఫారిత సజలోజ్జ్వలక్కష్ణ తారాబృహచ్చక్షువు లుండినను, అంతటి కటాక్షమయము కాదు, అంతటి లోలతయుఁ గాదు, కొంచెము నమ్రముగానుఁడెను. అధరము రాగవర్ణముగ నుండెను. హృదయము శ్వాసాను గామియై దడదడ కొట్టుకొనుచుండెను. బాహువులు మొదటియట్లే వన్యలతలకు దుష్ప్రాప్య మైన కోమలతతోఁ గూడి యుండెను. అయినను, ఇప్పుడా కాంతియు, ఆ యుజ్జ్వలతయు,ఆ ప్రఖరతయు,ఆచంచలతయు, ఆ లావణ్యమును లేదు. విస్తరించి చెప్పనేల? ఇపుడు ఆయౌవనమే లేదు. ప్రకృతమునందు కేవలము సౌందర్యమును మాధుర్యమును మాత్రమే నూతనముగా సంకురించి యుండెను ఇంతకు మునుపు ఈ యువతియొక్క దైర్య గాంభీర్యములను జూచి యుండినచో, నీమె దేవలోకసుందరి యని దోచును. ఇపుడు చూడఁగా, నీమె శాపగ్రస్తురాలై దేవలోకమునుండి భూలోకమునకు వచ్చిన దేవి యని తెలియుచున్నది. ఈమె కూర్చుండి యుండిన నలుదిక్కులందును నాలుగైదు పెద్ద పెద్ద పుస్తకములు పడి యుండెను గోడకు జగన్నాథ, బలరామ, సుభద్రాపటములు వ్రేలాడగట్టి యుండెను. మరియు కాళియ మర్దనము, నవనారీకుంజరము, వస్త్రాపహరణము, గోవర్ధనోద్ధారణము 'మొదలగు వ్రజలీలా చిత్రములు ప్రకాశించుచుండెను. ఆచిత్రముల క్రింద “చిత్రమో లేక విచిత్రమో” యని వ్రాయం