ఈ పుట అచ్చుదిద్దబడ్డది

152

ఆనందమఠము


భవానందుఁ డతికష్టముచే నవ్వు నాపుకొని, అక్కా! ఆ బ్రహ్మచారినిఁ జూచిన వెంటనే యగును, మరియు, అది య ట్లుండని, ఆవిడ యెట్లున్నది?' అని యడిగెను.

గౌరి దేవి వాడిన మోము గలదై మనస్సున, నన్నుఁ జేర్చి గొనుట పరిహాసముగా నుండునని యనుకొని, 'యిక నెట్లుం డఁగలదు? ఉన్నట్లే యున్న' దనెను,

భవా—— నీవు పోయి, నేను వచ్చి యున్నానని చెప్పిరమ్ము.

గౌరీ దేవి, చేతనున్న గరిటెను పాఱవైచి చేతులు కడిగి కొని, పైకి పోవునట్టి మిద్దెయొక్క పెద్ద పెద్ద మెట్లు వంగునట్లెక్కి పోయెను. ఒక చిన్న యింటియం దొక చింపిరి చాపపై సుందరీమణి యొకతె కూర్చుండి యుండెను. ఆయిన నాసౌంద ర్యము నొకఘారతర మగు ఛాయ నాచ్ఛాదించి యుండెను. మధ్యాహ్న కాలమునందు కులపరిపావనియు ప్రపన్న సలిలయు విపులజలకల్లోలినియు స్రోతస్వతియు నగు గంగావక్షమునందతి నిబిడ మైన మేఘఛాయవలె నేదో ఛాయ కప్పి యుండెను, నదీ హృదయంబున తరంగములు లేచుచుండెను; తీరంబునందలి పుష్పితతరుకులము వాయువు చేఁ దూఁగాడు చుండెను; మఱికొన్ని వృక్షములు ఘనపుప్ప భారముచే వంగు చుండెను; ఆ గట్టులోని అట్టాలకా శ్రేణి మిక్కిలి శోభించుచుండెను; ఆ నదియందు చనెడి తరణీ శ్రేణిచే తాడితమైన జలము తరంగ రూపమున నాందోళిత మగుచుండెను. మధ్యాహ్న కాలమయి నను, ఆ నిబిడమైన మేఘపంక్తి నీలచ్ఛాయయందు; సకలమైన శోభాకాంతులును నీలవర్ణ మయ్యెను. అట్లే ఈమెయొక్క మనోహరమును స్నిగ్ధమును చంచలమును నిబిడమునైన అలక