ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువది తొమ్మిదవ ప్రకరణము

151


దయమండలమును దాటి భుజముపై కెక్కి బలాత్కారమున కుడి చెవివఱకు వచ్చి, యిక ముందు పోలేనని ఖండితముగఁ జెప్పెను. ఇక చేయున దేమి ! గౌరీ ఠాకూరాణి వ్రీ డావనతు రాలై చెఱఁగును చేతఁ బట్టుకొని, యికముం దెనిమిది మూరల వస్త్రము నే తీసికొనవలయు ననెడి దృఢ ప్రతిజ్ఞాబద్ధురాలై , 'గోస్వామీ ! నా కెందులకు నమస్కారమన్నా !” అనెను.

భవానంద——నీవు అక్కవు కాదా ?

గౌరి——మీదయ. మీరుగోస్వాములు. దేవసమానులు. ఎట్లు చెప్పినను సరియే సరిగా నుండును. నమస్కారము చేసినను చేయవచ్చును. ఎటులైనను వయస్సున పెద్దదాననుకదా.

భవానందునికంటె గౌరీదేవి 30-35 సంవత్సరములు పెద్దది. అయినను, చతురుఁడైన భవానందుఁడు, 'ఇదేమక్కా! వినోదంబునకుఁ జెప్పుచున్నట్లున్నది. లెక్కించి చూచిన, నీవు నాకంటే ఆ ఱేండ్లు చిన్న దానవు కదా ! జ్ఞాపకము లేదా ! మా వైష్ణవజాతియం దన్ని మతముల వారును గలరు. మఠాధికారి యగు బ్రహ్మచారి యనుమతి నొంది నిన్నును వైష్ణవుల లోఁ జేర్చికొనవలయు నని యపేక్ష కలిగి చెప్పి 'పోవుద మని వచ్చితిని' అనెను.

గౌరి——ఛీ ! అదెట్టిమాట ! ఇట్లు చెప్పవచ్చునా? 'నేను ముసలిదానను కదా.

భవానంద—— అట్లయినచోఁ జేరఁగూడదా?

గౌరి——మీ యిష్టము, మీకుఁ దెలిసినట్లు చేయుఁడు, మీరు పండితులు, నే నాఁడుదానను, నా కేమి తెలియును ?అది యెప్పు డగును?