ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువదితోమ్మిదవ ప్రకరణము

149


జీవానందుఁ డాహ్లాదముచే గద్గదకంఠుఁడై—— నీవు నేర్పియే నేను నేర్చికొంటిని, అనెను.

శాంతి ప్రఫుల్లచిత్తయై——ఇంకను వినుము; గోసాయీ! ఇహమందే మన వివాహము నిష్ఫలమా? నీవు నన్నుఁ బ్రేమిం చుచున్నావు. నేను నిన్నుఁ బ్రేమించుచున్నాను. ఇంతకంటే ఇహమున నింకేమి యధిక ఫలము కావలయును? చెప్పుము——“వందేమాతరం”

అపు డాయిరువురును జేరి యేకకంఠముతో “వందేమాతరం” అనుగీతమును పాడిరి. వారు గానము చేయుచు కన్నీరు నించి యేడ్చిరి


ఇరువది తొమ్మిదవ ప్రకరణము,

భవానందుఁడు రాజనగరంబున కల్యాణితో సంభాషించుట

భవానందగోస్వామి, యొక్కసారి రాజనగరంబునకు వచ్చి ప్రశస్తమైన రాజవీథిని విడిచి చీఁకటిగా నుండు నొక సందున బోయెను. ఆసందులోని ఇరుపార్శ్వములందును గొప్ప గొప్ప మేడయిండ్లు కలవు. సూర్యుఁడు మధ్యాహ్న సమయంబునమాత్ర మొక్కసారి తొంగి చూచును. మరల నెప్పటివలె నచ్చట నంధకారమే. ఆసందులో నొక రెండంతస్తుల సౌధమునందు భవానందుఁడు ప్రవేశించెను. మొదటియంతస్తులో నొక చిన్న యింటియందు ఏఁబది యేండ్ల యాఁడు దొకతె వంట