ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువ దెనిమిదవ ప్రకరణము

147


     ఈ యావన జలతరంగ వరోధిపుఁ డెవఁడో?
          హరే మురారే! హరే మురారే!
మరల నెచ్చటనో సారంగ మధురధ్వని వినఁబడెను,
     ఈ యౌవన జలతరంగ వరోధిపుఁ డెవఁడో?
          హరే మురారే! హరే మురారే!
దానితో పురుషకంఠమును జేరి సంగీతము వినఁబడెను.
     ఈ యౌవన జలతరంగ వరోధిపుఁ డెవఁడో?
          హరే మురారే! హరే మురారే!

మూడు స్వరములు నొకటిగాఁ జేరి వనలతల నెల్లఁ గంపించెను. శాంతి గానము చేయుచు వెడలి పోయెను.

ఆ దట్ట మగు వనమున నేమి యుండినదియు బయట నుండి చూచిన గోచరము కాదు. శాంతి, యా వనమధ్యమునఁ బ్రవేశించెను. అచ్చట శాఖాపల్లవరాశియం దొక చిన్న కుటీర ముండెను. అది మ్రానికొమ్ములచేఁ గట్టఁబడి యాకులచేఁ గప్ప బడి యుండెను. అందలిగోడలు తడికెలు కట్టి మట్టిచే నలక బడినదిగ నుండెను. దానితలుపు లతలచే నల్లంబడి యుండెను. ఆతలుపును దెఱచుకొని శాంతి ప్రవేశించెను. అచ్చట జీవానందుఁడు సారంగమును వాయించుచుఁ గూర్చుండి యుండెను.

జీవానందుఁడు శాంతినిఁ జూచి, 'ఇన్ని దినములకు జల తరంగ ముప్పొంగి ప్రవహించెనా?' యనెను.

శాంతి నవ్వి, 'ఆనకట్ట కట్టఁబడినపిదప ఉప్పొంగి ప్రవహించు టెట్లు? ' అని యుత్తర మొసంగెను,