ఈ పుట అచ్చుదిద్దబడ్డది

146

ఆనందమఠము


పంజరము ఖాలీగా నున్నది. ఆపంజరములో నిన్నుంచి మంచి కల్లు పోసెదను; నీవు వచ్చెదవా ? మఱియు మాతోటలో మంచి రసదాళి యరఁటిపండ్లుకూడ యున్నవి.

థామస్—— నీవు మంచి వీరాంగన (spirited woman)గా నున్నావు. నీ ధైర్య శౌర్యములను (courage) గాంచి, నాకు చాల సంతోష మైనది; నీవు నాగుఱ్ఱముపై నెక్కుము. నీస్వామి యుద్ధమునఁ జచ్చిపోయినయెడల నీ వేమగుదువు?

శాంతి——సరియే, అయినను మన 'మొకశపథము చేసి కొందము. యుద్ధ మింకను రెండుమూడు దినములలో ప్రారంభ మగును; 'నీవు జయించితివేని నేను నీకు ఉపపత్ని నయ్యెదను మేము జయించితిమేని, నీవు జీవించి యుంటి వేని, మా పంజరమున వసించి పండ్లు తినుచుండెదవా?

థామస్—— అరఁటిపండ్లు తినుటకు ఉట్టమమైనడి (ఉత్తమమైనది). ఇప్పుడున్న దాయేమి?

శాంతి—— తీసికొనుము, నీతుపాకిను తీసికొనుము. ఇట్టి కొత్తజయశాలురతో నెవ్వరు మాటలాడఁగలరు?

శాంతి తుపాకీనిఁ బాఱవైచి నవ్వుచు వెడలి పోయెను.


ఇరువ దెనిమిదవ ప్రకరణము.

శాంతి భర్తకు హితము చెప్పుట

శాంతి హరిణ వేగముతో వనమధ్యమం దెచ్చటికో పోయెను. కొంచెము సేపటికి థామసు స్త్రీ కంఠమునుండి మధురమైన సంగీతమును వినెను.