ఈ పుట అచ్చుదిద్దబడ్డది

144

ఆనందమఠము


థామసు ఆయడవిలో గొంతదూరము పోయిన పిదప వెంటవచ్చిన వేఁటకాండ్రు, ముందడుగిడ రైరి. ఇఁకముందు మార్గము లేదు; కనుక, పోవుటకు పాధ్యపడదని వెనుక నిలిచిపోయిరి. డనివర్తుఁ డొకానొకప్పు డాయరణ్యమధ్యమున పులి చేతికిఁ జిక్కి పడరాని పాట్లు పడి యుండెనుగాన, నది జ్ఞాపకమునకు వచ్చినందున వాఁడు ముందుపోవుట కిష్టపడ లేదు. అందఱును వెనుకకుఁ దిరిగి పోవలయునని చెప్పిరి. 'కేష్ట౯ దొరమాత్రము ఎవరు ఎన్ని విధములఁ జెప్పినను వినక మీరు పొండు, నేను వచ్చుటలే దని చెప్పి, యామహారణ్య మధ్యమునం బ్రవేశించెను.

ఆయరణ్య మధ్యమున మార్గమే లేదు. గుఱ్ఱము పోవుటకును త్రోవ లేదు. కనుక గుఱ్ఱమును విడిచి పెట్టి భుజము పై తుపాకి నుంచికొని యొక్కఁడే యరణ్యమునఁ బోయెను. అచ్చటచ్చట, పులిని వెదకుచుఁ బోయెనుగాని దొరక లేదు. చూచిన దేమి? ఏవి యోజంతువు ఒక్క పెద్ద చెట్టు క్రింద ప్రస్ఫుట మగువికసితకుసుమ యుక్తలతాగుల్మంబులచే నావరింపఁబడిన ప్రదేశమందు కూర్చుండియున్నట్లు కనుగొనెను. అదేమి? పులియా ! పులి కాదు. ఒక సన్న్యాసి. అతని తేజము వనమునంతయు ప్రకాశింప జేయుచుండెను ప్రస్ఫుటిత మైనపుష్పము లా దేవసదృశం బగు శరీరసంసర్గముచే నధిక సుగంధయుక్త మయ్యెను. కేప్ట౯ థామసు విస్మితుఁ డాయెను. విస్మితుఁ డగుటయేగాక, కోపమును వహించెను. థామసునకు దేశ భాషచక్కఁగా వచ్చియుండెను, గాన, 'నీవు యెముఁడ' వని యడిగెను (ఎవఁ డనుటకు బదులుగా యెముఁ డని చెప్పియుండును.)