ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువ దేడవ ప్రకరణము

143


రెండవ దౌపదియైయుండెను, అందువలన, థామసు హెచ్చు మాట చెప్పక నచ్చటనే యుండెను.

ఇచట, భవానందుఁడు పండ్లు కొఱుకుచు మనస్సుననేప్పు డీకేష్ట౯ దొరతలను ఖండించి శంబరారి యను పేరు పొందుదునో యని యాలోచించుచుండెను. ఆంగ్లేయులు హిందూస్థాన దేశము నుద్ధరించుటకై వచ్చియున్నారని సంతాను లెఱుఁగరు. ఎట్లు తెలిసి కొందురు! కేష్ట౯ థామసుయొక్క సమసాయ యికు లగు నితర యింగ్లీషుజనులను వా రెఱుఁగరు. అప్పటి యింగ్లీషువారి మనస్సులోని యుదేశ్యము భగవంతుని యిష్టమునందుమాత్రమే యుండెను. భవానందుఁడు, తనమనసునం దీయసురులను నాశము చేసి వేసెద; అందఱు నొకటిగా చేరనిమ్ము; వా రేమరి యుండనిమ్ము; 'నేను కొంచెము దూరముగనే యుండెదనని యీవిధముగాఁదలపోయుచుండెను. సంతాను లందఱును మఱుగున నుండిరి. కేస్ట౯ థామసు నిష్కంటకముగ ద్రౌపదియొక్క గుణగ్రహణంబున నివిష్టచిత్తుఁడై యుండెను.

థామస్ సికారియం దిష్టము గలవాఁడు. అప్పుడప్పుడు శివ గ్రామ సమీపమునగల యరణ్యమునకు వేఁటాడుట కేఁగుట కలదు, ఒకనాఁడు డనివర్తుతోఁగూడిఁ గుఱ్ఱమునెక్కి కొందఱు వేటకాండ్రనుఁ బిలిచికొని పోయి యుండెను. థామసు అస మసాహసికుఁడై బలపరాక్రదుంబులయం దాంగ్లేయజాతివారిలో సాటి లేనివాఁడై యుండెను. ఆయరణ్యము పులులు ముండ్ల పందులు ఎలుఁగుగొడ్లు మొదలగు దుష్ట మృగముల కావాసస్థానమై యుండెను. జను లచ్చటికిఁ బోవుటకు భయపడుదురు.