ఈ పుట అచ్చుదిద్దబడ్డది

142

ఆనందమఠము


మునకై మంచి బియ్యము నెయ్యి గోధములు మొదలగువానిని బండ్లపై తెప్పించుచుండిరి, దానిం గని నోట నీరూరి నూతనముగ సంతాను లైన మాలలు ఆబండ్ల నడ్డగించిరి. అయినను, వారు థామసుయొక్క సిపాయీల చేత నుండిన తుపాకుల దెబ్బల కోర్వక, 'వెన్నిచ్చి పాఱిరి. కేష్ట౯ థామసు తత్ క్షణమే కలకత్తాకు వ్రాసిన దేమనఁగా:——

ఈదినము నూట 'యేఁబది యేడ్గురు కంపెనీసిపాయీలను దీసికొనిపోయి పదునాల్గు వేల నేడు సూర్ల రాజవిద్రోహులను పరాజయ మొందించితిని. ఈ రాజవిద్రోహులలో రెండు వేల నూటయేఁబది ముగ్గురు హతులైరి; వేయియు నిన్నూటముప్పది ముగ్గుకు గాయ మొందిరి: ఏడ్గురు ఖైదీలుగాఁ జిక్కిరి. అని వ్రాసెను—— ఇందు తుదిమాటమూత్రమే సత్యము. కేష్ట౯ థామసు, 'బ్లేనహిం' లేక రసవాకుని యుద్ధమునందు జయము కల్గినదని తెలిసికొని గడ్డమును మీసమును దువ్వుకొనుచు నచ్చటచ్చట తిరుగుచుండెను. మఱియు డనివర్తుదొరతో, ఇంకేమి? రాజ విద్రోహము నివారణ మాయెను; నీపుత్ర కళత్రములను కలకత్తానుండి రప్పించుకొనవచ్చు నని హెచ్చరిక చేసెను. డనివర్తు, 'అటులనే కానిండు; తామిచ్చట నింకను పదిదినము లుండుఁడు; దేశ స్థితి యింకను గొంచెము స్తిమితమునకు రానిండు, తదనంతరము నాభార్యయు పిల్లలు వత్తు' రనియెను. డనివర్తునింట చాల గొట్టెలును కోళ్లును నుండెను, ఉత్తమ మైన పన్నీరును నానావిధము లగు అడవిపక్షులును మృగములును నతనిభోజనమునకు సిద్ద మగుచుండెను. గడ్డము పెంచినవాఁ డొక బబ్బర్చి