ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువ దేడవ ప్రకరణము

141


కులను బారు చేసికొని సంతానుల వధకై వెడలిరి. అయినను, సంతానులసంఖ్య యెక్కువగా నుండి దేగాక, వారు అజయ్యులై యుండిరి. కేష్ట౯ థామసుయొక్క సైనికులు, కోత కాలములో కొడవలికి దొరికిన పైరువలె కత్తరింపఁబడిరి. హరిహరిధ్వనిచే కేష్ట౯ థామసుయొక్క చెవులు చెవుడు వడెను. ఈవిధముగ 1776. వసంత్సరమునందు వీరభూమిలో సంతానులు ప్రసిద్ధి కెక్కిరి.


ఇరువ దేడవ ప్రకరణము

ఆకాలమున కంపెనీవారిచే పట్టుపనిచేయు కార్ఖానాలు స్థాపింపబడి యుండెను. శివగ్రామంబున నొకకొఠా రుండెను. డనివర్తుదొర అనునాఁ డాకోఠారునకు ఫ్యాక్టరు(Factor) అనఁగా అధ్యక్షుఁడై యుండెను. కొఠారుల సంరక్షణ విషయమునందు తగిన యేర్పాట్లు కలిగియుండెను. డనివర్తుదొర యెట్లో తన ప్రాణరక్షణము చేసికొని వసించుచుండెను. అయినను, వాఁడు తనభార్యను బిడ్డలను కలకత్తాకుఁ బంపి యుండెను. ఇట్లుండినను వానికి సంతానుల యుపద్రవము తప్ప లేదు. ఈసమయమున నాప్రదేశంబునకు నాలుగైదు పటాలములతోడ కేష్ట౯ ధామసువిజయముచేసి యుండెను, కొత్తగాఁజేరిన మాలలు మొదలగు నీచజాతి సంతానులు కొందఱు పరధనాపహరణంబునందు త్సాహులై యుండిరి. కేష్ట౯ థామసుదొరవారు సైన్య