ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువదియాఱవ ప్రకరణము

139


నకువచ్చి నిలిచినను, సంతాను లగుటచే వారు తురకలను ఛిన్న భిన్నము చేసి హరిధ్వని చేయుచుండిరి. సంతానుల బలమును యవనసై నికులు పాఱఁ ద్రోలినను, అప్పుడే యెక్కడ నుండియో వేఱోకసంతానులగుంపు వచ్చి తురకల తలలను నరికి పాఱవైచి “హరి హరీ” యని వెడలిపోవుదురు. రాజైన అసదుల్ జమానునకు మిక్కిలి కష్టము సంభవించెను. వాఁడు అనేకములైన ఫిరంగులు మందు గుండ్లు ఏనుఁగులు గుఱ్ఱములు ఇంకను కావలసినవానిని బంపెను. అందువలనఁగూడా సంతానుల “జయజగదీశ హరే" యను నినాదము నివారణము కాలేదు. అసదుల్ జమానుఁడు తాను రాజ్యచ్యుతుఁ డగుదు ననియే నిశ్చయించెను.

అపు డతఁడు దుఃఖితుఁడై యాంగ్లేయులకు జాబు వ్రాసెను., ఎట్లన:—— నే నిప్పుడు నేలపన్ను రూపాయలను వసూలు చేయుట కేమి చేసినను సాధ్యపడలేదు. ఇరసాలు పంపలేను; ఇప్పుడు మీరు రక్షించితి రేని పిదప వసూలు చేయవచ్చును; లేనియెడల మీరే వచ్చి వసూలు చేసికొనవలయును'.

ఆంగ్లేయులు మొదట కొన్ని చోట్లయందు తామే పన్నులు వసూలు చేసికొనుచుండిరి. అయిన, నిప్పుడు వారి ప్రయత్నము విఫల మగుచు వచ్చెను. ఈ సమయంబున ప్రధిత నామకుఁ డగు భారతవర్ష యింగ్లీషుకులోత్పన్నుఁ డైన ప్రాత స్సూర్యుఁడోయనునట్లు ప్రకాశిం చెడు వార౯ హేస్టింగ్సు భారతవర్ష గవర్నరు జనరలుగా నుండెను. అతఁడు కలకత్తాలో కూర్చుండి యొక యినుపగొలుసును ముందిడుకొని మనస్సునందీయొక్క గొలుసుతో నీససాగరద్వీపభారతభూమిని కట్టి