ఈ పుట అచ్చుదిద్దబడ్డది

138

ఆనందమఠము


గ్రామములపైఁబడి వారిండ్లను కాల్చుచుండిరి., ముసల్ మానులు ప్రాణరక్షణయందు వ్యస్తులై యున్నప్పుడు వారి సర్వస్వ సంతానులు దోఁచుకొనిపోయి దానిని క్రొత్తఁగా వచ్చిన విష్ణుభక్తులకు పంచి యిత్తురు. కొల్లలో దొరకిన భాగముతో గ్రామనివాసులు తృప్తులు కాఁగనే వారినిఁ బిలిచికొని వచ్చి విగ్రహముల పాదస్పర్శ చేయించి వారిని సంతానులుగఁ జేయుదురు. జనులు సంతానత్వమునందు విలక్షణమైన లాభము కలదని భావించిరి. విశేషముగా తురకల 'రాజ్యమందు సరిగాని యనాయకత్వమును గాంచి, యందఱును వారియందు విరక్తులైరి. హిందూధర్మము లోపముగా నుండిన కారణముచే ననేక హిందువులు హిందూమతమును స్థాపించుటకు ప్రబలమగు నాతురము గలవారైరి కావున, సంతానులసంఖ్యవృద్ధి యైనది. దినదినము నూర్ల కొలఁదిజనులు చేరుచుండిరి. అందఱును భవానందజీవానందుల పాదములపైఁబడి వారి యాజ్జా ప్రకారము దండులోఁ జేరి తురకలను శాసింపఁబోవుచుండిరి. సర్కారునౌకర్లను ఎచ్చటఁ జూచినను పట్టి కొట్టుచుండిరి. కొందఱను జంపుటయుఁ గలదు. సర్కారు ధన మెచ్చటనుండినను కొల్లగొట్టి యింటికిఁ దెచ్చుకొందురు. తురకల గ్రామము కనఁబడినచో కాల్చి బూడిద చేయక వదలరు.

అప్పుడు నగరంబున మహారాజునకు హెచ్చరిక గలిగెను. సంతానులను శాసించుట కతఁడు సైన్యములను బంప నారంభించెను. అయినను, అదివఱుకే సంతానులు బలవంతులై శస్త్ర ధారులై మహాపరాక్రమశాలులై యుండిరి. వారిదర్భ మునకు తురకల సైన్యము నిలుపక పోయెను. ఒక వేళ ముందు