ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువదియాఱవ ప్రకరణము

137


మయ్యెను. నాట్య మందిరములందు విషసర్పములు పగటియందే కప్పలను వెదకుచుండెను. పంటపండునుగాని, తీనుటకు జనులు లేరు. ధాన్యముపండినను ధనము లేదు. కొనువారే లేరు. జమీందారులు కప్పముల నిచ్చుటకు శక్తి లేనివా రైరి. వారికి రైతు లియ్యవలసిన పన్ను నియ్యరు. రాజు జమీందార్లను జప్తు చేసినందుచే హృతసర్వస్వులై దరిద్రు లగుచు వచ్చిరి, భూమాత సుప్రసూతియాయెను. అయినను సొమ్ము పుట్టదు. ఎవ్వరింటియందును ఒక కాసై నను లేదు. ఎవని చేతికి దోరకిన దానిని వాఁడే తినుచుండెను. దోపిళ్లు, దొంగతనములు ప్రబలమాయెను. సాధుశీలుఁడు భీతి చే నిల్లు విడిచి కదలక తలదాచుకొని యుండెను

ఇచట సంతాన సంప్రదాయస్థులు నిత్యమును చందన పుష్ప తులసీదళములచే విష్ణుపాదపద్మంబులను పూజ చేయుచు నెవరి యింటియం దైనను తుపాకి పిస్తోలు లుండినచో వానిని దీసికొని వచ్చుచు నుండిరి.

భవానందుఁడు, 'భ్రాతృలారా! ఇండ్లయందు పద్మరాగ వజ్ర వైడూర్య ప్రవాళాదు లుండినను వానిని తాఁకక, విరిగిపోయిన తుపాకిగా నుండినను వానినిమాత్రము తీసికొనిరం' డని చెప్పుచుండెను.

సంతాన సేనాధిపతులు ఒక్కొక గ్రామంబునకును దమ యనుచరులను బంప నారంభించిరి. అనుచరులు గ్రామంబు లకుల బోయి యెచ్చట హిందూజనులను జూచినను వారినిఁ గూర్చి విష్ణుపూజ చేయుదురా? యని యడుగుదురు. ఇట్లు చెప్పుచు ఇరువది ముప్పదుగురు గుంపుగాఁ జేరి ముసల్ మానుల