ఈ పుట అచ్చుదిద్దబడ్డది

136

ఆనందమఠము


బులలోని యిండ్లు పాడుపడి పశుపక్షులకు విశ్రామభూమియై ప్రేతభీతికిఁ గారణమాయెను. పంటభూములను సాగుబడి చేయువారు లేక, బీడుపడి గట్టి పెరిఁగి యుండెను. దేశమంతయు కాననమున లేఁ గన్పట్టెను. ఎచ్చట శ్యామలకోమల మగు సస్య రాశి ప్రకాశించుచుండునో; ఎచ్చట అసంఖ్యాకములగు పశుపక్షులు మేయుచుండునో; ఎయ్యది. గ్రామమం దుండు యువకయువతులు గుంపు చేరి యామోద ప్రమోదంబులఁ జేయుచుండిన యుద్యానభూములుగా నుండునో; అవియన్నియు ఘోరతరమైనవనంబగుచు వచ్చెను. ఒక యేఁడు కడచెను; రెండేండ్లు చెల్లెను, మూఁడేండ్లాయెను. కాననము మఱింత వృద్ధియగుచు వచ్చెను. ఏస్థలము మనుష్యుని సుఖంబున కాటపట్టై యుండెనో యది నరమాంస లోలుప మైన వ్యాఘ్రదులకు వాస స్థలమాయెను, ఎచ్చట సుందరీమణులు గుంపు చేరి యలకాంకిత చరణంబులయందలి గజ్జెలు, పిల్లాండ్లు, గోలుసులు, మెట్టులు ఈ మొదలగు నాభరణములు ఘల్లు ఘల్లున శబ్దము చేయఁగా నెచ్చెలులతో సరససల్లాపము లాడుచు పకపక నవ్వుచుఁ బోవుచుండిరో యాస్థలములయందు భల్లూకములు బిలంబులను ద్రవ్వికోని పిల్లలను కని లాలన పాలన చేయ నారంభించెను. ఎచ్చట పిన్న వాండ్రు పిన్న వయసున సంధ్యాకాల మల్లికా కుసుమమువలె ఉత్ఫుల్లహృదయులై యాటపాటలఁ బొద్దు పుచ్చుచు సంచరించుచుండిరో యాస్థలములయందు మత్తగజంబులు చెట్ల కొమ్మలను లాగుచుఁ దిరుగుచుండెను. ఎచ్చట దుర్గోత్సవములు జరుగుచుండెనో యచ్చట సృగాలావాస