ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువదియైదవ ప్రకరణము

133


విశ్వాసముల నటనను గాల్పుము. నన్ను గుర్తింపకపోతిరి!" అనియెను.

అప్పుడు జీవానందుని మనస్సునకు జరిగిన దంతయుఁ బ్రస్ఫుట మాయెను, శాంతిగాక మఱెవ్వ రీపని చేయుదురు ? శాంతితప్ప ఇట్టిచమత్కారమును జేయుట కెవ్వరు సమర్థులు ? శాంతికి గాక, మఱెవరి బాహువులయం దింతటి బలము గలదు ? ఇట్లు చింతించి యానందభరితుఁడై అప్రతిభుఁడై యేమో చెప్పందొడంగెను. అయినను, అవకాశము లేకపోయెను. గోసాయీలు వచ్చి చేరిరి. ధీరానందుఁడు మున్ముందుగా వచ్చి, జీవానందునిఁ గూర్చి 'యిదేమి గల్లంతు' అనేను.

జీవానందుఁ డేమని యుత్తర మియ్యఁగలడు? శాంతి ఆసమయమున వాని చెవిలో 'నన్ను నీవుపట్టుకొని యుంటి వని యెట్లు చెప్పుదు' నని చెప్పి, కొంచెమునవ్వి, ధీరానందుని ప్రశ్న కుత్తరముగా—— గల్లంతు జరిగెను. ఎవతె యోయాడుఁది యఱ చుచుండెను. అది తన పాతివ్రత్యమును భంగవఱి చిరనికూసెను, ఎచ్చటనో తెలియలేదు, జీవానందుఁడును వెదకెను, నేనును వెదకి వెదకి వేసారితిని, ఎవరును గనుపడ లేదు. మీరందఱు నొక్కసారి యాయడవియందు వెదకిన బాగుగ నుండును. ఆవైపున దూరముగా అఱచినశబ్దము వినవచ్చెను, అని చెప్పెను.

శాంతి గోసాయీలకు నిబిడ మగు నరణ్యమును జూపెను, జీవానందుఁడు శాంతినిఁగూర్చి 'వైష్ణవుల కింతటి తొందర యిచ్చుటవలన నీ కేమిఫలము ? ఆవనంబున కేఁగినచో, వారు మరలి రా వీలగునా? పామే కఱచునో, లేక, పులియే తినునో యనెను.