ఈ పుట అచ్చుదిద్దబడ్డది

132

ఆనందమఠము


గోసాయీలు దీపములు దీసికొని దగ్గఱించుటను గని,"నేను కాపురుషుఁడను. నీవు విడిచి పెట్టుము, 'నేను పాఱిపోయద' ననియెను.

శాంతి—నీ బలమును జూపి విడిపించుకొనుము.

జీవానందుఁడు లజ్జచే స్త్రీ చేతిపట్టును విడిపించుకొనఁజాల నని నుడువుటకు సిగ్గయి, 'నీవు చాల పాపిష్ఠురాల' వని చెప్పెను.

శాంతి, చిరునగవుతో విలోలకటాక్షమును బ్రసరింపుచు,'ప్రాణాధికా! 'నేను నీయందు బద్ధాను రాగయై యున్నాను,నేను నీ దాసిని, కావలయు ననియే యిటకు వచ్చితిని. నన్ను గ్రహింపుము. గ్రహింతు నన్న చో విడిచి పెట్టెద ననియెను.

జీవానంద—— దూరముగా పో. పాపీ ! దూరముగాపో, ఇట్టిమాటను నేను వినఁజాలను.

శాంతి——నేను పాపియే. అందులకు సందేహము లేదు. అట్లు కాకున్నచో స్త్రీనై పుట్టి పురుషుని చెంతకు వచ్చి ప్రేమ భిక్షు నడుగుచుంటినా? నేను చెప్పిన ప్రకారము చేయుము, విడిచి పెట్టెదను.

జీవానంద—— ఛీ, ఛీ, ఛీ, ! నేను బ్రహ్మచారిని—— నాకిట్టి మాటఁ జెప్పఁదగినది కాదు. నీవు, నాయొక్క——

వెంటనే శాంతి, భయముచేత 'యూరకుండు మూర కుండుము, నేను శాంతి' ననియెను.

ఇట్లు చెప్పి శాంతి జీవానందుని విడిచి యతని పాదధూళిని శిరస్సున ధరించుకొని చేతులు మోడ్చి, 'ప్రభూ! అపరాథమును మనంబున నుంచకుము. అయినను, పురుషుల ప్రీతి