ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువదియైదవ ప్రకరణము

131


తక్కువ. ఈవిద్యలో జీవానందుఁడు నిపుణుఁడు, తటాలున పోయి శాంతిని కొట్టవలయునని యెంచి పట్టుకొనెను. ఆమెను తాఁకిన మాత్రాననే జీవానందుఁడు విస్మితుడై విడిచి పెట్టెను. అయినను, శాంతి జీవానందుని మెడపై చెయి వేసి గట్టిగా పట్టుకొనియెను.

జీవానందుఁడు, 'ఏమి, నీవు స్త్రీవి! విడువుము, విడువుము!,అనెను. శాంతి యామాటను చెవి నిడక గట్టిగా, 'ఎవరు లేరా, చూడుడు, చూడుఁడు, ఒక సంతానుఁడు బలవంతముగా స్త్రీ యొక్క సతీత్వమును భంగపఱచుచున్నాఁడు' అని యఱచెను.

నా యాఁడుదాని జీవానందుఁడు, చేతితో నామె నోరు మూసి, 'సర్వనాశము ! అట్టిమాటఁ జెప్పవలదు, విడువుము, విడువుము నాకు నోప్పిగా నున్నది.'

శాంతి విడువ లేదు. ఇంకను గట్టిగా నఱచెను. శాంతి పట్టును విడిపించుకొనుట సామాన్యము కాదు. జీవానందుఁడు రెండు చేతులను జోడించుకొని, “నీ కాళ్లకు మొక్కెదను, విడువుము' అని వేఁడికొనెను. ఇంతలో నా యాఁడుదాని యార్తధ్వని యాయరణ్య మంతయు నావరించెను.

ఇచట మఠమునం దున్న గోసాయీలు ఆఁడుదానిని అత్యాచారము చేయుచున్నా రని విని, యనేకులు చేతిదీపములను వెలిఁగించుకొని దుడ్డుకఱ్ఱలను చేతఁబట్టుకొని వెడలిరి. జీవానందుఁడు వారినిఁజూచి వడవడ వడంకెను, శాంతి ‘ఇంత వణఁ కేల? నీవతి భయస్థుఁడవు ! జనులు నిన్ను మహావీరుఁడవని పొగఁడుచున్నా' రనెను.