ఈ పుట అచ్చుదిద్దబడ్డది

130

ఆనందమఠము


శాంతి—— దానిని జెప్పుటకు నా కేమిభయము ? జనులు జీవానందుఁడు భ్రష్టుఁడు మూర్ఖుఁడు, అని చెప్పెదరు.

జీవానంద—— భ్రష్టుఁడు, మూర్ఖుఁడు, ఇంక నేమనియెదరు!

శాంతి——బుద్ధి లేనివాఁడు, అని కూడ.

జీవానంద—— ఇంక నేమి చెప్పెదరు?

శాంతి—— యుద్ధమునందు చేతకానివాఁ డని.

జీవానందునికి శరీరమంతయు కోపముచే ధగధగ మండి, ఇంక నేమైనఁ గలదా!' యని యడిగెను.

శాంతి——ఇంకెంతని చెప్పుదును, నిమాయి తన చెల్లెలని కూడ చెప్పెదరు.

జీవానంద——నీవు గూబవు

శాంతి—— నీవు ఎలుగుబంటివి.

జీవానంద——నీవు ఉలూక, ఆర్వాచీన, నాస్తిక, విధర్మ, భ్రష్ట, సామరుఁడవు.

శాంతి——నీవు యలాయవాయవోచీచః, నీవు స్తుశ్చుభిశ్చ్వళాత్ , నీవు ష్టుభిష్ట యాదాంతయో. *[1]

జీవానంద——ఓరీ! ఇటనుండి వెడలుము, లేకున్న నీగడ్డమును పెరికి వేయుదును చూడుము.

శాంతి, గడ్డమును పట్టినచోఁ బ్రమాద మగు ననియెంచికొని స్థలమును విడిచి పలాయన తత్పరురా లయ్యెను.

జీవానందుఁడు వెంటనంటి పరుగెత్తెను, మఠమును విడిచి బయటికి పోయినచో రెండుతన్నులు తన్నవచ్చు నని తలంచి

పరువిడెను, శాంతి యెంతైనను స్త్రీ పరువిడెడి యభ్యాసము

  1. * వ్యాకరణసూత్రములు కొంచెము వికృతమై యుండవచ్చును!