ఈ పుట అచ్చుదిద్దబడ్డది

128

ఆనందమఠము


జీవానంద——మ ఱెవ్వరి గది?

శాంతి—— నాగది.

జీవానంద——నీది కాదు. నీ వెవరవు?

శాంతి—— నేను నీ చెల్లెలి మగఁడను.

జీవానంద.——నీవు నావాడ వగుదువో కాదో! నేను నీవాఁడ నని తోచుచున్నది. నీకంఠ ధ్వని నాభార్య కంఠ ధ్వనివలె నున్న ట్లగపడుచున్నది.

శాంతి—— బహుశాలము నీ భార్యకును నాకును ఏకాత్మ భావ ముండెను. దానిచే నిరువుర కంఠధ్వను లొకటిగా నుండవచ్చునని తోఁచుచున్నది.

జీవానంద——ఏమి? చాలా అధిక ప్రసంగము లాడెదవు? ఈ మఠమునఁ గాక ఇతరస్థలమై యుండినచో నొక్క గుద్దుగుద్ది పండ్లు రాలగొట్టి యుండును,

శాంతి—— పండ్లూడఁ గొట్టుట సామాన్యము కాదు. నిన్నటి దినము నగరమున నెంతమంది దంతము లూడఁ గొట్టితివి, లెక్క పెట్టుము, వ్రేళ్లు విడిచెదను, ఏదీ చూతము, దంభముచే గార్య మగుట లేదు, నే నిచ్చట పరుండినాను, నిద్దుర వచ్చుచున్నది, మీరు సంతానులలోఁ జేరినవారు, గత్తర యాయెనా వెంటనే పాఱిపోయి బ్రాహ్మణ స్త్రీల చీరలను కప్పుకొని దాఁగుదురు.

జీవానందఠాకూరు మహాకోపము వహించెను, సత్యానందుఁడు ఆనందమఠమున సంతానులు పరస్పరము కొట్టు కొనరాదని నిషేధించి యున్నాఁడు. అయినను, వీనినోరు మూయింపక యుండఁగూడదు. చెంపదెబ్బ తీయవలసియే