ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువదియైదవ ప్రకరణము

127


శాంతి——ఏల?

గోవర్ధన—— జీవానంద ఠాకూరు ఇచట నుందురు.

శాంతి—— వారు లేరు, కావలసి యున్న వేఱేగదిని చూచు కొనఁగలరు.

గోవర్ధన ——అది యె ట్లగును? ఎవ్వ రిచ్చట నుందురో వారే దీనికి యజమానులు. వారేమి చేసినను చేయుదురు.

శాంతి—— మంచిది, నీవుపో, నాకు చోటు దొరకకున్న యెడల నొక చెట్టుక్రింద నుండెదను.

ఇట్లని చెప్పి గోవర్ధనుని కాజ్ఞ యిచ్చి పంపి శాంతి యాగది యందుఁ బ్రవేశించి జీవానందుని కృష్ణా జినమును పఱచుకొని దానిపైఁ బండుకొనియెను.

కొంచెము సేపటికి జీవానంద ఠాకూరు వచ్చెను. దీపము వెల్తురు ప్రకాశముగా నుండనందున కృష్ణాజినముపై పరుండి యుండుటను దెలియక దానిపై గూర్చుండఁబోయి, శాంతి మోఁ కాలిపైఁ గూర్చుండెను. ఉన్నట్లుండి మోఁకా లెత్తి నందున జీవానందుఁడు క్రింద పడెను.

జీవానందునికిఁ గొంచెము నొప్పి యాయెను, అతఁడు క్రుద్ధుఁడై లేచి కూర్చుండి 'యెవ రిచ్చట!' యని గద్దించి యడిగెను.

శాంతి—— నీకు మనుష్యుల మోఁకాలి పైఁ గూర్చుండుట కేర్పఱచిన స్థల మిదేనా?

జీవానంద——నీవు దొంగతనముగ నాగదిలోఁ బరుండి యుండు టెవ రెఱుంగుదురు?

శాంతి—— నీగది యె ట్లాయెను?