ఈ పుట అచ్చుదిద్దబడ్డది

126

ఆనందమఠము


"జయుఁడును యుద్ధము చేయుచున్న ట్లగపడెను. నేత్రములు నిమీలితములై యుండెను. భ్రూయుగ్మము స్థిరముగా నుం డెను, ఓషము నీలవర్ణ మై యుండెను. గండస్థలము పాండురమై యుండెను. ముక్కు చల్లనై యుండెను, వక్ష మున్నత మై యుండెను. వాయువు వసనమును విక్షిప్తము జేయుచుండెను. కొంచెము సేపటికి యెట్లు శరత్కాల మేఘమునందు విలుప్తుఁడైన చంద్రుఁడు క్రమక్రమముగా మేఘ రాశిని ఉద్భాసితము జేసి తనసౌందర్యమును బయలుపుచ్చునో; ఎట్లు ప్రభాత సూర్యుడు తరంగాకృత మైన 'మేఘమాలికను క్రమక్రమముగా సువర్ణీ కృతము జేసి ప్రదీప్తుఁడై దిజ్మండలమును వెలింగించి స్థల జల కీట పతంగంబులను ప్రఫుల్లము జేయునో; అట్లే యా శవము యొక్క దేహమందు ప్రాణసంచారకాంతి ప్రకాశించుచు వచ్చెను. ఆహా ! ఎట్టికాంతి? భవానందుఁడు ఆ మొగము నందే దృష్టి నుంచి యుండెను. అతఁడు పలుక లేదు. కల్యాణి రూపంబునం డతని హృదయ మాకర్షింపబడి యుండెను. శాంతిరూపముపై నతని దృష్టి పోలేదు,

అటనుండి శాంతి మఱోకగదియొద్దకుఁ బోయి, 'ఇవి 'యెవ్వరిది' అని యడిగెను.

గోవర్ధన——జీవానంద ఠాకూరు వారిది.

శాంతి——వారెక్కడ? ఇచట నెవ్వరు లేరుగదా?

గోవర్ధన —ఎక్కడికైనను బోయి యుందురు. ఇపుడే వత్తురు.

శాంతి——ఇది యన్నిటికన్న బాగుగ నున్నది.

గోవర్ధన—— ఈ గదియం దుండుటకు వలనుపడదు.