ఈ పుట అచ్చుదిద్దబడ్డది

124

ఆనందమఠము


సత్యానంద——తల్లీ! భవానివలె నీ లలాటమునందు ఆగ్ని ప్రజ్వలించుచున్నది. సంతానసంప్రదాయస్థుల నందఱను కాల్చి వేయుదువే మొ? అని చెప్పి, శాంతిని దీవించి యనుజ్ఞ నొసంగెను.

శాంతి మనంబున, 'ఓరీ ముదుసలిగొడ్డా! నాముఖము నందా యగ్ని! నేను కాలినముఖము గలదాననా? నిన్నుఁ గన్న తల్లి కాలినముఖము గలది.' అని యనుకొనెను.

వాస్తవముగా సత్యానందున కీ యభిప్రాయము లేదు. ఆమె నేత్రంబుల విద్యుత్కటాక్షమును గుఱించి యతఁ డట్లు చెప్పెను. అయినను, ఆముసలివాఁడు యువతికి వివరించి చెప్ప వచ్చునా?


ఇరువదియైదవ ప్రకరణము

జీవానంద నవీనానందుల కలహము.

శాంతి యారాత్రి మఠముననుండుట కనుజ్ఞఁ గొని యుండెనుగాన, మఠమున నొక గదిని చూచికొనుటకై పోయెను.పెక్కు గదులుండినవి. గోవర్ధనుఁ డను నొక పరిచారకుఁ డుండెను. వాఁడును సంతానుఁడే. అయినను, పై తరగతిలోఁ జేరినవాఁడు కాడు. వాఁ డొక దీపమును చేతఁ బట్టుకొని గదులను చూపుచు వచ్చెను. ఏగదియు శాంతికి సమ్మతముగ నుండ లేదు. హతాశుఁడై శాంతిని సత్యానందుని కడకుఁ బిలిచికొని పోవుటకు యత్నించెను.