ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువదినాలుగవ ప్రకరణము,

123


సత్యానంద—— అందులకై యేడ్చెదను; జీవానంద శోకంబునకై యేడ్చెదను.

శాంతి—— నేనును దానికొఱకే వచ్చి యున్నాను. జీవానందుని ప్రాణము పోకుండునట్లు చూచుకొని యుండుటకే వచ్చి యున్నాను.

సత్యానంద——బాలా ! నీ యభీష్టము సిద్ధించుగాక. నీ యపరాధముల నన్నిటిని మన్నించితిని. నీవు సంతానుల యందు పరిగణితురాలవై యుందువు. నీ మర్మము నెఱుంగ నందున నిన్నుఁ దిరస్కరించితి, నా కేమి తెలియును? నేను వనచారి యగు బ్రహ్మచారినిగాని వేఱుకాదు. నేను స్త్రీల వలె నౌదునా? అ దెట్లగుదును ? జీవానందుఁడు నా ప్రాణాధిక ప్రియుఁడు, ఇప్పుడు చూచితివా ! కుడి చేయి పడిపోయినచో దేవకార్యము నెఱవేఱదు, ఎన్ని దినములు సాధ్యమో యన్ని దినంబులవఱకును జీవానందుని పృథ్వియం దుంచుటకు బ్రయత్నింతును. నీవును కూడనుండి యీ బ్రహ్మచర్యంబును బాలింపుము. నీవు నా ప్రియశిష్య వైతివి. సంతానులని వినినచో నా కానందము. కావున సంతానుల కందఱకును "ఆనంద” యను నామ మిడఁ బడినది. ఇది “ఆనందమఠము" నీవు “ఆనంద" యను పేరును ధరింపుము. నీ పేరు "నవీనానంద" యని యుండనిమ్ము.

శాంతి—— నేను ఆనందమఠమున నుండవచ్చునా?

సత్యానంద——ఇఁక నెచటికి పోదువు? ఈ రాత్రి యిచటనే యుండుము.

శాంతి——తర్వాత?