ఈ పుట అచ్చుదిద్దబడ్డది

122

ఆనందమఠము


యున్నది. జీవానందుఁడు నా కుడిభుజమై యున్నాఁడు. నీవు నాకుడిభుజమును విఱుచుటకై వచ్చితివి.

శాంతి——నేను తమకుడిభుజము బలమును ఎక్కువ చేయుటకై వచ్చియున్నాను. 'నేను బ్రహచారిణిని, విభునితో బ్రహ్మ చారిణిగనే యుండెద. నేను కేవల ధర్మాచరణము కొఱకే వచ్చినదానను. స్వామి సందర్శనంబునకుఁ గాదు. విరహయం త్రమునకు నేను లోఁబడినదానను గాను. స్వామి ధర్మచ్యుతికి రక్షకురాలను, వాన లేక గొప్పవృక్షము లెండి పోవును. నేను మహామహీరుహతలము నందు వర్షింపఁ జేయుదు. తాము నిశ్చింతతో నుండుఁడు.

సత్యానంద——అదేమి ; మహామహీరుహంబునకు అనావృష్టి భయము కలదా ? జీవానందునికి ధర్మచ్యుతియా?

శాంతి—— అయినదానిని కానీక చేయఁగలవా?

సత్యానంద—— ఏమై యున్నది? జీవానందునికి ధర్మచ్యుతి కల్గినదా? హిమాలయములోని కొనలో మునిఁగిపోయెనా ?

శాంతి—— నిన్న మధ్యాహ్నంబున వారు వచ్చి చూచిరి; వ్రతభంగమై పోయెను.

దీనిని విని, పలిత కేశి యగు బ్రహ్మచారి రెండు చేతులతో కనులు మూసికొని యేడ్చెను. సత్యానందు డేడ్చుటను చింతకుము న్నెవరును జూచి యుండ లేదు.

శాంతి——ప్రభూ! మీకన్ను ల నీరు రాఁదగునా?

సత్యానంద—— ప్రాయశ్చిత్త మేమి తెలియునా ?

శాంతి——తెలియును. ఆత్మహత్య యే.