ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువదినాలుగవ ప్రకరణము

121


తోఁగూడ ధర్మాచరణ మాచరించుటకై వచ్చి యున్నాను' అనెను.

శాంతి యొక్క గంభీరవాణినివిని, యామె యున్నత గ్రీవమును, స్ఫీతవక్ష: స్థలమును, కంపితాధరమును, అశ్రుప్లుత నేత్ర ములను గాంచి సత్యానందుఁడు అమితానందంబును బొంది 'శాంతినిఁజూచి, “నీవు సాధ్వివి. అయినను, తల్లీ ! పత్నీ కేవలము గృహధర్మమున సహధర్మిణిగాని, వీరధర్మమున రమణి లేదుగదా? '

శాంతి—— ఏమహావీరుఁడు అపత్నీ కుఁడై వీరుఁడై యుండెను? రాముఁడు సీతలే కుండిన వీరుఁ డగుచుండెనా? అర్జునున కెందఱో భార్య లుండిరి. భీమున కెంతబలమో యందఱు పత్ను లుండిరఁట ! ఎతయని చెప్పుదును ? తమకుఁ దెలియని దేమున్నది?

సత్యానంద—— నీవు చెప్పునది నిజము; అయినను, రణరంగమున నేవీరుఁడు భార్యాసహితుఁడై యుండెను?

శాంతి——అర్జునుఁడు యాదవసైన్యముతో నంతరిక్షమునఁ బోరునపు డాతని రథమును నడపినవారెవరు? ద్రౌపది సమీపమున లేకుండిన, పాండవులు కురుక్షేత్రమునందు యుద్ధము చేయుదురా?

సత్యానంద—— వా రట్టుండవచ్చును. సామాన్యు లగు మనుజుల మనస్సు స్త్రీలయం ద్రాసక్తమై కార్యభంగ మగు చున్నది. ఆ హేతువు చేత సంతానుల వ్రతమందు స్త్రీలతోడనే కాసనంబునం గూర్చుండరా దనుపద్ధతి యొకటి యేర్పడి

.