ఈ పుట అచ్చుదిద్దబడ్డది

120

ఆనందమఠము


శాంతి—— చేతులు జోడించికొని, నేను సామాన్యురాలగు మనుష్య స్త్రీని, అయినను, నేను బ్రహ్మచారిణిని యనెను.

సత్యానంద—— అయిన 'నేమి? నీవు బాలవితంతువా? అట్లయినను ఇంత బల మెక్కడిది? అది యేకాహారికదా?

శాంతి—— నేను సధవను.

సత్యానంద——నీస్వామి నిరుద్దిస్టుఁ డా? ఎవరు, చెప్ప వచ్చునా?

శాంతి—— ఉద్దిష్ణుఁడే; అతనికొఱకే వచ్చితిని.

ఉన్నట్లుండి మేఘమును భేదించుకొని వెడలి వచ్చిన యెండవలె, సత్యానందుని స్మృతి ప్రకాశమాన మయ్యెను. వెంటనే జీవానందుని భార్య పేరు శాంతి యని తెలిసికొని, “నీవు జీవానందుని బ్రాహణి వేనా?' యనెను.

ఈ తేప జటాభారముచే నవీనానందుని ముఖము మఱుఁగు చేయఁబడియెను. కొన్ని యేనుంగుల తొండములు రాజీవములపైఁ బడియున్న వియో యనున ట్లగపడియెను.

సత్యానందుఁడు—— 'ఏల నీ వీపాపాచరణము నాచరించుటకై వచ్చితిని?' అని యడిగెను.

శాంతి—— వెంటనే జటాభారమును వీపుపై వేసికొని, ముఖమెత్తి, 'ప్రభూ! పాపాచరణ మేమున్నది? పత్ని పతి ననుసరిం చుట పాపాచరణమా! సంతానుల ధర్మశాస్త్రమునందు దీనిని పాపాచరణ మని చెప్పియుండినయెడల, సంతానుల ధర్మ ము అధర్మమైనయదే. 'నేను నాస్వామియొక్క సహధర్మిణిని. వారు ధర్మాచరణమందు ప్రవృత్తులై యున్నారు. నేను వారి