ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువది మూఁడవ ప్రకరణము

115


పుఁడై యున్నాఁడో; యట్టి మహానుభావుఁడు ప్రతిజ్ఞా భంగకారిని ధ్వంసము చేసి నరకంబునఁ బడ వేయునుగాక !

ఉభయులు—— తథాస్తు,

సత్యానంద——మీరు "వందే మాతరం” అని గానము చేయుఁ డనఁగా నిరువురు నా నిభృతమందిరమున మాతృస్తోత్రమును పాడిరి. పిమ్మట బ్రహ్మచారి వారికి యథావిధిగా దీక్ష నొసంగెను.


ఇరువది మూఁడవ ప్రకరణము.

మహేంద్రుఁడు స్వగృహమున వసించుట కియ్యకొనుట

దీక్షాసమాపనాంతరమున సత్యానందుఁడు మహేంద్రుని యత్యంతము నేకాంతమగు నొక స్థలమునకుఁ బిలిచికోని పోయెను. ఇరువురును గూర్చున్న పిదప, సత్యానందుఁ డిట్లని చెప్పందొడంగెను. "కుమారా! ఇపుడు నీవు మహా వ్రతమును గ్రహించినందుచే భగవంతుఁడు మనపక్షముగా నున్నాఁడని తలంచెదను. నీ మూలముగా మాతృమహత్కార్యము నెఱ వేఱవలసినదిగా నున్నది. నీవు చక్కఁగా నామాటలను చెవి యొగ్గి వినుము. నీవు భవానంద జీవానందులతో వనవనంబు లను దిరిగి యుద్ధము చేయ నవసరము లేదు. నీవు పదచిహ్న గ్రామంబునకు మరలి పొమ్ము. స్వగృహంబున నుండియే సన్న్యాసధర్మంబు నాచరింపుము."

మహేంద్రుఁడు విస్మితుఁడై , కొంచెము వ్యాకులమనస్కుం డాయెను. ఏమియు నుత్తర మియ్య లేదు. బ్రహ్మచారి