ఈ పుట అచ్చుదిద్దబడ్డది

114

ఆనందమఠము


సత్యానంద—— సనాతనధర్మంబునకై శక్తివంచన లేక అస్త్ర పాణులై యుద్ధము చేయుదురా?

ఉభయులు—— చేయుదుము.

సత్యానంద—— రణరంగంబున వెనుదీయరుకదా?

ఉభయులు—— వెనుదీయము,

సత్యానంద—— ప్రతిజ్ఞాభంగ మొదవినచో?

ఉభయులు—— జాజ్వల్యమానమగు అగ్ని యందుఁ బ్రవేశింతుము 'లేక, విషమునైనను తిని ప్రాణములను ద్యజింతుము.

సత్యానంద—— ఇంకొక మాట మహేంద్రుఁడు కాయస్థుఁడని నాకుఁ దెలియును; ఇంకోకనిఁ జూచి, నీ వేజాతి వాడవు?

మఱోక్కఁడు—— నేను, బ్రాహణకుమారుఁడను.

సత్యానంద—— మంచిది, మీరు జాతిని విడువఁగలరా? సంతానులంద ఱోకే జాతి. ఈమహా వ్రతంబున బ్రాహ్మణ శూద్ర భేదము లేదు: మీరేమి చెప్పెదరు?

ఉభయులు——మే మాభేదము నుంచుకోనుట లేదు. మన మందఱ మొక మాతృసంతానులము.

సత్యానంద—— అట్లయినచో మిమ్ము దీక్షితులను జేసెదను, మీ రిపుడు చేసిన ప్రమాణవాక్యములయం దొక్కదాని కైనను భంగము రాగూడదు. శ్రీమురారియే దీనికి సాక్షి. ఎవ్వఁడు రావణ కుంభకర్ణ కంస హిరణ్యకశిపు జరాసంధ శిశుపాలాది దుష్టుల నాశనంబునకు హేతుభూతుఁడై యుండెనో; ఎవఁడు సర్వాంతర్యామియై, సర్వజయియై సర్వశక్తిమం తుఁడై , సర్వనియామకుడై , యున్నాడో, ఎవఁడు ఇంద్రుని వజ్రాయుధంబునను, మార్జాలనఖములయందును తుల్యరూ