ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువది రెండవ ప్రకరణము

113


ఉభయులు—— చేయుదుము.

సత్యానంద—— ఎన్ని దినములవఱకు . మాతయొక్క ఉద్దారము కాదో యంతవఱకు గృహధర్మములను త్యజింతురా?

ఉభయులు—— అట్లే చేయఁగలము,

సత్యానంద——తల్లిదండ్రులను విడిచెదరా?

ఉభయులు—— విడిచెదము,

సత్యానంద—— భ్రాతలను భగినీలను?

ఉభయులు—— వారినిఁగూడ విడిచి పెట్టేదము.

సత్యానంద—— దార సుతులను?

ఉభయులు——త్యజించెదము.

సత్యానంద—— ఆత్మీయస్వజనులను? దాసదాసీజనులను ?

ఉభయులు.——అందఱను బరిత్యజించెదము

సత్యానంద——ధనము? భోగములు?

ఉభయులు—— సర్వము పరిత్యాగ మాయెను.

సత్యానంద—— ఇంద్రియములను జయింతురా ? ఏకాసనమున స్త్రీలతోఁ గూర్చుండకుందురా!

ఉభయులు——ఇంద్రియములను జయించెదము. అట్లు కూర్చుండుట లేదు.

సత్యానంద——భగవత్సాక్షిగా సొంతమునకుఁగాని, లేక స్వజనులకోఱకుఁ గాని అర్ధోపార్జన చేయుట లేదని ప్రతిజ్ఞ చేయుదురా! ఏముపార్జన చేసినను దానిని వైష్ణవధ నాగారంబున కోసంగుదు మని ప్రమాణము చేయుదురా?

ఉభయులు——అట్లే ప్రమాణము చేయుదుము.