ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువది రెండవ ప్రకరణము

మహేంద్రుఁడు దీక్షితుఁ డగుట

సత్యానందుఁ డిట్లు చెప్పిన మీఁద మహేంద్రసింహునిఁ బిలిచికోని మఠమందు అద్భుత చతుర్భుజమూర్తి నెలకొని యున్న అపూర్వ శోభోయమాన మగు దేవాలయమునఁ బ్రవేశించెను. అపు డచ్చట అవూర్వశోభాకాంతిగల స్వర్ణ రత్న ములచే నలంకరింపఁబడిన బహువిధ దీపములు "వెలుఁగుచుండేను. వివిధ పుష్పరాసులచే మందిరము ఆమోదముగా నుండెను. మందిరమున నొకఁడు కూర్చుండి మెల్ల మెల్ల గా “హరేమురారే” యని నుడువు చుండెను. సత్యానందుఁడు మందిరమును బ్రవేశింపగనే యా మనుష్యుఁడు లేచి ప్రణామం బాచరిం చెను.

బ్రహ్మచారి——నీవు దీక్షితుఁడ వయ్యొదవా! యనెను.

ఆమనుష్యుఁడు—— నన్ను అనుగ్రహించి దీక్ష నొసంగిన గ్రహించెద.

అపుడు సత్యానందుఁడు అతనిని, మహేంద్రుని సంబోధించి, వారిరువురును యథావిధిగా సుస్నాతులరై సంయతులై యనశనులై యున్నారు కదా! యని యడిగెను.

ఉభయులు—— ఆరీతిగనే యున్నాము.

సత్యానంద—— మీ రిరువురును భగవత్సాక్షిగా సంతానమత ధర్మనియమంబుల కన్నిటికి బద్ధులరై యుందు మని ప్రతిజ్ఞ చేయఁగలరా?