ఈ పుట అచ్చుదిద్దబడ్డది

110

ఆనందమఠము


సత్యానంద—— అది చైతన్యుని సంప్రదాదాయకు లగు వైష్ణవుల ధర్మము. ఆధర్మము నాస్తికులగు బౌద్ధుల ధర్మము నను సరించి ఆస్వాభావికముగ ఉత్పన్నమై యుండు వైష్ణవమతము. స్వాభావికమగు వైష్ణవమతధర్మ మెట్టిదనఁగా, దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించి ధరిత్రి నుద్ధరింపవలయును. ఏలనఁగా, విష్ణువే జగంబుసకు రక్షకుఁడై యున్నాఁడు. పదిమాఱు లవతరించి పృధ్వి నుద్ధరించినాఁడు. కేశి, హిరణ్యకశిపు, మధు, కైటభ, ముర, నరకాది దైత్యులను, రావణాది రాక్షసులను, కంసశిశుపాలాది రాజులను, అతడే స్వయముగా యుద్ధమునందు ధ్వంసము చేసి యున్నాఁడు. అతఁడే జేత, జయదాత, పృధ్వి యొక్క ఉద్ధారకర్త మఱియు సంతానుల యిష్టదేవత. చైతన్యుని యొక్క వైష్ణవధర్మము ప్రకృతి వైష్ణవ ధర్మము కాదు. అది అర్ధవైష్ణవ ధర్మముగా సున్నది. అది సంపూర్ణ వైష్ణవధర్మము కాదు చైతన్యుని విష్ణువు ప్రేమమయుఁడు. అయినను, భగ వంతుఁడు కేవల ప్రేమమయుఁడు కాఁడు.. ఆతఁడు అనంతశక్తి మయుఁడై యున్నాఁడు. చైతన్యుని విష్ణువు శుద్ధ ప్రేమమ యుఁడు. సాంతానికుల విష్ణువు శుద్ద శక్తి మయుఁడు. మన మిరువురమును వైష్ణవులమే. అయినను, ఇద్దఱును అర్ధవైష్ణవులే ఇపుడైనఁ దెలిసినదా?

మహేంద్ర—— లేదు. ఇదేమో క్రొత్తమాటగా నున్నది. కాశీంబజారునం దొక పాదిరితో నేను మాటలాడినపుడు, వాఁడును ఇట్టిమాటలనే చెప్పెను, అనఁగా, ఈశ్వరుఁడు ప్రేమమయుఁడు. నీవు యేసు క్రీస్తును గొలువు మనెను. మీమాటలును అట్టి మాటలుగనే యున్నవి.