ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువదొకటవ ప్రకరణము

109


లను మఱిచి వ్రతగ్రహణము చేసియున్నారా! అట్లుండినయెడల సంతానుల సంఖ్య యత్యల్పముగా నుండునే ?

సత్యానంద——సంతానులలో దీక్షాబద్ధులును, దీక్షబద్ధులు కానివారు నని రెండు తరగతులవారు కలరు. ఎవరు దీక్షా బద్ధులు కారో యట్టి వారు సంసారులు; 'లేక , బికారులు. అట్టివారు 'కేవలము యుద్ధకాలమున మాత్రము వత్తురు. కోల్లలో భాగమునుగాని యితర పురస్కారమును గాని పొంది వెడలి పోదురు. ఎవరు దీక్షాబద్ధులో యట్టివారు సర్వత్యాగులు, వారే సంతానుల సంప్రదాయమునకు కర్తలు, నీవు దీక్షా బద్ధుఁడ వైన సంతానుఁడవుగా నుండవలయు నని నాకోరిక , యుద్ధమునకు ఖడ్గములు బల్లెములు కుంతములు మొదలగు ననే యాయుధములు కలవు. దీక్షితుఁడవు గాకుండినయెడల ఈసంప్రదాయస్థుల ఘన కార్యములకు నీ వధికారివి కావు.

మహేంద్ర——దీక్ష యన నేమి? దీక్షితుఁడై యుండవలయునా? నేనింతకు మునుపే మంత్ర గ్రహణము జేసినాఁడను.

సత్యానంద—— ఆమంత్రమును విడిచి పెట్టవలయును. నాచే మరల మంత్రోపదేశము కావలయును.

మహేంద్ర——మంత్రమును విడుచు టెట్లు?

సత్యానంద——-నేను ఆపద్దతిని జెప్పెదను.

మహేంద్ర——-కొత్తగా మంత్రోపదేశ మెందులకుఁ గావలయును?

సత్యానంద——సంతానులు వైష్ణవులు.

మహేంద్ర——అది నాకు స్ఫురింప లేదు. సంతానులు వైష్ణవులే కావలసిన దేల! వైష్ణవులకు అహింస పరమధర్మము కదా !