ఈ పుట అచ్చుదిద్దబడ్డది

108

ఆనందమఠము


మును గ్రహించుట నిశ్చయమగు నేని, బిడ్డ సమాచారమును దెలిసికొని యేమి చేయఁబోయెదవు! చూచినను ప్రకృతమున ప్రయోజనము లేదు.

మహేంద్ర—— ప్రభో! ఇంతకఠినమగు నియమ మెందులకు?

సత్యానంద——సంతానుల కార్య మతికఠిన మైనయది. ఎవరు సర్వత్యాగులో యట్టివారు తప్ప, మఱెవ్వరును ఉపయుక్తులు కారు. మాయాగజ్జుచే నెవరిచిత్తము బద్ధమై యున్నదో అట్టి వారు దారమునకుఁ గట్టిన గాలిపటమువలెనే భూమిని విడిచి స్వర్గము నెక్క లేరు.

మహేంద్ర——మహాస్వామీ! నాకుఁ జక్కఁగా బోధపడ లేదు. ఎవరు దారసుతాదుల ముఖ దర్శనముఁ జేయుదురో యట్టివారు గురుతర మగు కార్యమున కధికారులు కారా?

సత్యానంద—— పుత్త కళత్రముల ముఖములఁ జూచిన మాత్రమున దైవసంబంధములయిన పనులను మఱచి పోదురు. సంతానుల నియమ మేమనఁగా, ఆవశ్యక మైనపుడు ప్రాణ త్యాగమునకును భయంపడ కూడదు. బిడ్డ ముఖము మనస్సు నకు జ్ఞాపకము వచ్చినయెడల బిడ్డను విడిచి ప్రాణ త్యాగంబునకు సిద్ధుఁ డగుదువా?

మహేంద్ర——చూడకుండిన మాత్రముననే జ్ఞాపకము లేకుండునా?

సత్యానంద—— మఱచుటకుఁ గానిచో నీవీ వ్రతమును గ్రహింప వలదు.

మహేంద్ర——సంతాను లందఱును ఇట్లే పుత్ర కళత్రము