ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువదోకటవ ప్రకరణము

మహేంద్రునకు సత్యానందుఁడు హితోపదేశము చేయుట.

సత్యానందుఁడు సాయాహ్ని కకృత్యమును దీర్చుకొని, మహేంద్రునిఁ బిలిచి 'నీబిడ్డ జీవించి యున్న 'దని పలికెను.

మహేంద్ర——ఎక్కడ మహాస్వామీ!

సత్యానంద——నీవు నన్ను “మహాస్వామి”యనెద వేల?

మహేంద్ర——మఠాధికారులను “మహాస్వామి” యని పిలువవలయు నని యందఱును చెప్పెదరు. 'నాబిడ్డ యెక్కడ, మహాస్వామీ!

సత్యానంద—— ఆసంగతిని తెలిసికొనుటకు ముందు నేనడుగు ప్రశ్నలకు బదులు చెప్పుము. నీవు సంతానుల ధర్మంబును గ్రహించెదవా?

మహేంద్ర—— అటులనేగ్రహింపవలయునని నిశ్చయించు కోని యున్నాను.

సత్యానంద—— ఆటు లైనచో “బిడ్డ యెక్కడ” యని యడుగరాదు.

మహేంద్ర——ఏల మహాస్వామీ!

సత్యానంద——ఎవరు ఈ వ్రతమును గ్రహించెదరో వారు తమ యాలు బిడ్డలు స్వజనులు వీరెవ్వరిసంబంధము నుంచుకొనఁ గూడదు. ఆలుబిడ్డల ముఖమును జూచినచో ప్రాయశ్చిత్తము గలదు. ఎంతవఱకు సంతానుల కార్యము సిద్ధియగుట లేదో యంతవఱకు నీవు నీ బిడ్డను జూడరాదు, నీవుసంతానులధర్మ