ఈ పుట అచ్చుదిద్దబడ్డది

106

ఆనందమఠము


చిత్తాకర్షణ చేయుటయందు దక్షుఁడు. నేను పోయెదను; ఇంకొక మాట యున్నది, దానిని మనసుంచి వినుఁడు.

అనఁగా, వారిర్వురును చేతులు జోడించుకొని ఆజ్ఞ పాలింపవలయు నని విన్నవించుకొనిరి.

సత్యానంద——మీ రిరువు రేమైన యపరాధమును జేసి యుండినను, లేక, నేవచ్చునంతలోఁ జేసినను, నేవచ్చువఱకును దానికి ప్రాయశ్చిత్తము జరుపవలదు. నే వచ్చినపిదప, ప్రొయశ్చిత్తము జరపఁ దగినది.

ఇట్లు చెప్పి సత్యానందుఁడు స్వస్థానంబునకుఁ జనెను. భవానందుఁడును జీవానందుఁడును పరస్పరము కన్ను లెగరవేసి తల లల్లాడించిరి.

భవానంద—— నీమీఁది మాటయే కదా?

జీవానఁద—— ఉండవచ్చును. చెల్లెలింటికి మహేంద్రుని బిడ్డను విడిచిరాఁ బోయి యుంటిని.

భవానంద—— దానియందు దోష మేమి? అదేమి నిషిద్ధము కాదు; బ్రాహ్మణీని జూచివచ్చితివా యేమి?

జీవానంద—— గురు దేవుఁడు దానినే మనస్సున నుంచుకొని చెప్పియుండవచ్చునని తోఁచుచున్నది.