ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువదవ ప్రకరణము

105


భవానందుఁ డాశ్చర్యానందపరవశుఁడై, 'తాను ఔషధము నిచ్చి బ్రతికించిన స్త్రీ రత్నము మహేంద్రుని భార్యయైన కల్యాణీయే, యని నిశ్చయించెను. అయినను, ఆసమయంబున నేమాటయుఁ జెప్పుట కవసరము లేదని మిన్న కుండెను.

జీవానంద—— మహేంద్రుని భార్య యెట్లు చచ్చెను?

సత్యానంద—— విషమును మ్రింగి చచ్చెను.

జీవానంద—— విషము నేల మ్రింగెను?

సత్యానంద—— భగవంతుఁ డామెస్వప్నంబున ప్రాణ త్యాగంబుఁ జేయుమని యాజ్న నోసంగెను.

భవానంద——ఆ స్వప్నా దేశము సంతానుల కార్యోధ్ధారముకొఱకేనా యేమి?

సత్యానంద——మహేంద్రసింహుఁ డిట్లనియే చెప్పెను. ఇపుడు సాయంకాలమైనది; నేను సాయంకృత్యములను దీర్చికొని వచ్చి నూతన సంతానులకు దీక్ష నొసంగెదను.

భవానంద——సంతాను లెందఱు? మహేంద్రసింహుఁడుగాక మఱెవ్వరైనను తమ నిజశిష్యులుగా వచ్చియున్నారా?

సత్యానంద——ఔను; మఱియొక క్రొత్తవాఁడు వచ్చియున్నాఁడు. వానిని నేనెపుడును జూచినది లేదు. నేఁడు వాఁడువచ్చి నాఁడు, వాడు స్వల్పవయస్సుగల యౌవనపురుషుఁడై యున్నాఁడు, వానియాకా రేంగితంబులను,మాటలను జూచి మిక్కిలి సంతోషము బొందినాఁడను వాఁడు బంగారుముద్దవలె నున్నాఁడు. వానిని సంతానుల కార్యమందు శిక్షితునిఁగాఁ జేయు భారము జీవానందునియం దున్నది. ఏలనఁగా, జీవానందుఁడు జనుల