ఈ పుట అచ్చుదిద్దబడ్డది

104

ఆనందమఠము


జీవానంద—— అదెట్లు? ఈ యానందమఠమందేనా?

సత్యానంద——దానిని మఱెచ్చట చేయవచ్చును? ఇందులకై నేను పెక్కు దినములనుండి చింతించుచున్నాఁడను. ఈశ్వ రుఁడు దాని కిపుడు మార్గమును జూపి యున్నాడు. దేవుడు ప్రతికూలుఁ 'డై యున్నాఁ డని మీరు చెప్పితిరి. అనుకూలుఁ డయ్యే యున్నాఁ డని నానమ్మకము.

భవానంద——కార్యశాల నెచ్చట నుంచవలయును ?

సత్యానంద—— పదచిహ్న గ్రామంబున.

జీవానంద——అచ్చట నెట్లు జరుపనగును ?

సత్యానంద——అట్లు కాకుండినచో నెందులకై మహేంద్ర సింహు: డీమహా వ్రతమును గ్రహింపవలయును?

భవానంద——మహేంద్రసింహుడు వ్రతంబును గ్రహించినాఁడా!

సత్యానంద——వ్రతంబును గ్రహింప లేదు గ్రహించును, ఈ దినమురాత్రి యతనిని వ్రతదీక్షితునిఁగాఁ జేసెదను.

జీవానంద—— మహేంద్రసింహుని వ్రతదీక్షితునిగాఁ జేయుట కెట్టి ప్రయత్నములు జరిగి యున్నవో నే నెఱుగను. అతని భార్య బిడ్డ యవస్థ ఏమిగా నున్నదో ! వారి నెచట నుంచి యున్నాఁడో? నే నీదినము నదీ తీరమునం దొకశిశువును జూచితిని. దానిం గొనిపోయి నా చెల్లెలి చెంతఁ జేర్చి వచ్చినాఁడను. ఆశిశుసమీపంబున నొకసుందరమైన యువతి చచ్చి పడియుండెను. ఆమెయే మహేంద్రునిభార్యగా నుండుననియు తలఁచితిని.

సత్యానంద—— వారే మహేంద్రుని పెండ్లమునుబిడ్డయును