ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువదవ ప్రకరణము

103


కార లాఘవంబున నీయపజయము సంభవించెను. ఇప్పుడు చేయవలసిన దేమనిన, మనము నట్టి యస్త్ర సాధనఁ బులను చాలినంత సంపాదింపవలయును.

జీవానంద—— అది బహు కఠిన వ్యాపారము.

సత్యానంద—— కఠిన వ్యాపారమా! జీవానందా! నీవు సంతానుఁడ వై యుండియు నిట్టి మాట చెప్పఁదగునా ! మన కసాధ్యమైన కార్య మెద్ది కలదు ?

జీవానంద—— స్వామీ ! వాని నెట్లు సాధింప నగునో సెల వొసంగుఁడు.

సత్యానంద—— వాని సంగ్రహార్థమై నేఁటి రాత్రికి తీర్థయాత్ర వెడలెదను. నేను మరల వచ్చునంతవఱకును మీరు ఎక్కువ పనులకుఁ బోకుండుఁడు; సంతానులలో ఐకమత్యంబును గాపాడుకొని యుండుడు; మీరు వారికి గ్రాసపసనంబుల నిచ్చుచుఁడుటయేగాక, మాతృరణ జయార్థమై అర్థ భాండాగారంబును పూర్ణముగా వృద్ధిపణిచియుంచి కొనుఁడు. ఈ భారము మీయిరువురపై నున్నది.

భవానంద—— స్వామి ! తీర్థయాత్ర చేసి వీనిని సం సంగ్రహంబు చేయుట యెట్లు? మందు, గుండు, తుపాకి, ఫిరంగి మొదలగువానిని విలువకుఁ గొని పంపుట చాల కష్టము. మఱియు ఇవన్నియు దొరకు టెక్కడ? విక్రయించు వా రెవరు! తెచ్చువారెవరు?

సత్యానంద——వెల యిచ్చి కొనుటకు నాచేత కాదు. నేను పనివాండ్రను బంపెదను, ఇచ్చటనే వాని నన్నిటిని తయారు చేయవలయును.