ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పందొమ్మిదవప్రకరణము

101


దించెను. ఎవఁడేని కవియైనవాఁడు ఆ నవీన “కృష్ణత్వచం గ్రంధి మతీం దధాన” ను గాంచి యుండిన యెడల, ఇప్పుడు మన్మథుని వినాశ మట్లుండుగాక, ఆమన్మథుని పునర్జీ వనశంక చేయును. ఈ ప్రకారము సజ్జీ భూతురాలైన, యానవీనసన్న్యాసిని నాల్గుప్రక్కలను సావధానముగాఁ జూచి యెవ్వరును లేరని తెలిసికొని, గోప్యముగా రక్షింపఁబడిన యొక పేటికను దీసి దానియం దుండిన యొక మూటను విప్పి నేలపై నుంచెను. అవి కేవలము భావమగుపుస్తకములుగా నుండెను. మనసునందు వీని నేమి చేయవచ్చును? వెంటఁ దీసికొనిపోయి చేయునదేమి ? ఈ భారమును మోయు టెట్లు ! ఇచట నుంచిపోయినచో: బ్రయోజనమేమి ? జ్ఞానముచే సుఖము లే దనునది తెలిసెను. అది కేవలము భస్మరాశిమాత్రమై యున్నది. ఆభస్మము భస్మముతోనే పోవలసినదని యెంచి అగ్రంథముల నొకటొకటిగా మండెడు మంటలో వైచెను. కావ్య, సాహిత్య, అలంకార, వ్యాకరణములు, (ఇఁకను నేమేమి యిండునో చెప్పనలవి కాదు) అన్నియు భస్మావశిష్ట మైపోయెను. రాత్రి రెండవజామున యంధ కారంబున శాంతి సన్యాసవేషంబుతోఁ దలుపు తెఱచుకొని యేకాకిగా గంభీరమైన వనమధ్యమును బ్రవేశిం చెను. గ్రామవాసు లా యర్థరాత్రి సమయంబున కాననమధ్యమందు అపూర్వమైన సంగీత ధ్వనిని వినిరి.